Friday, November 22, 2024

TG | గొర్రెల పంపిణీ స్కాంలో మరో ఇద్దరు అరెస్ట్

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరెప్షన్ బ్యూరో – ఏసీబీ.. తాజాగా మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది. పశుసంవర్ధకశాఖ సీఈఓ సబావత్‌ రామ్‌చందర్‌‌తోపాటు ఓఎస్‌డీ కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేశారు. రూ.2.10 కోట్ల గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్ నిందితులుగా ఉన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిద్దరినీ కోర్టులో హాజరుపర్చింది.

ఇక ఫిబ్రవరిలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి.. మేడ్చల్‌ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌‌లను అరెస్ట్ చేసి.. కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి.. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement