Monday, September 23, 2024

TG | ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్…

ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్‌లో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి టెట్‌ నిర్వహించ‌నున్న‌ట్టు… ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. టెట్ పాసైన వారికే డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఇస్తారు.

ఇంతకుముందు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం టెట్ గడువును జీవితకాలానికి పొడిగించింది. అలా ఒకసారి అర్హత సాధించిన తర్వాత మళ్లీ రాయాల్సిన అవసరం లేదు. కానీ, డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉన్నందున, ఇప్పటికే టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తమ స్కోర్‌ను పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement