Wednesday, November 20, 2024

TG దేశానికే ఆదర్శం తెలంగాణ పోలీసులు: డిజిపి జితేందర్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని రాష్ట్ర డిజిపి జితేందర్ తెలియజేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించగా డిజిపి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

.అనంతరం మాట్లాడుతూ నూతన కార్యాలయ సేవలు ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చాయన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికత దన్నుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే అంశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.

- Advertisement -

ప్రజలకు మేలు చేసే పాలసీలను, వ్యవస్థల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, జిల్లా పోలీస్ కార్యాలయ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఎస్పీ ఛాంబర్ లో అఖిల్ మహాజన్ కు డిజిపితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథరెడ్డి, పోలీస్ కార్పొరేషన్ ఎండి రమేష్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, ఆర్.ఐ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు డిపిఓ సిబ్బంది, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement