నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు తమ ఆందోళనకు విరమించారు. తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్ ఏఎస్) పేరుతో ఏర్పాటైన విద్యార్థుల సంఘం తమ సమస్యల పరిష్కారం కోసం గత నాలుగు రోజులుగా నిరసన చేపట్టింది.
ఈ మేరకు ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో చర్చలు జరిపి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాగ్దానాల కాపీని వీసీ తమకు ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. ఆ హామీలు నెరవేరుస్తారనే నమ్మకంతో ప్రస్తుతం సమ్మే విరమణ చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు.
టీఎస్ఏఎస్ డిమాండ్లు !
ప్రస్తుత ఇన్చార్జి వీసీ వెంకటరమణ వెంటనే రాజీనామా చేయించి కొత్త శాశ్వత వీసీని నియమించాలి.
రెండేళ్లుగా వీసీ, డైరెక్టర్ల ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేయాలి.
టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో పర్మినెంట్ నియామకాలు చేపట్టాలి.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న మెస్ కాంట్రాక్టులను రద్దు చేసి వాటికి కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించాలి.
విద్యార్థుల ఆత్మహత్యలపై స్వతంత్ర కమిటీని నియమించాలి.
పెరుగుతున్న బాలికల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్లలో మెరుగైన భద్రతా సౌకర్యాలు కల్పించాలి.
ఉన్నతచ వృత్తిపరమైన విద్యను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి.
పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని….