Thursday, November 21, 2024

TG | డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

హైదరాబాద్ : డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా… దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేర‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ ఎంటమాలజీ, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, ఏఎంహెచ్‌ఓలు, తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డెంగ్యూ పాజిటివ్‌ కేసులన్నింటిని తనిఖీ చేయాలని, ప్రతిరోజూ బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని, డెంగ్యూ మలేరియా చికెన్‌ గున్యా తదితర వ్యాధులపై ఎప్పటికప్పుడు డీసీలు, వైఎస్‌ఈలు, ఏఈలతో సమీక్షించాలని జోనల్‌ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.

అన్ని పాఠశాలలు, కళాశాలలు హాస్టళ్లను సందర్శించి డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని…. ప్ర‌తిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ‌గింగ్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. స్లమ్ ఏరియాలో పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, సీనియర్ ఎంటమాలజిస్టులు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ప్రతిరోజూ 5 నుంచి 6 ప్రాంతాల్లో త‌ప్ప‌కుండా రీచెక్ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement