Saturday, November 23, 2024

TG | రాష్ట్ర‌ దశాబ్ది వేడుక‌లు ప్రారంభించిన బీఆర్‌‌ఎస్..

తెలంగాణలో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఈరోజు గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.

ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాలు, బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ర్యాలీని ముందుకు తీసుకెళ్తున్నారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి కేసీఆర్ ర్యాలీని ప్రారంభించారు.

కొవ్వొత్తుల ర్యాలీ కారణంగా ఆ ప్రాంతమంతా లైట్లతో ఆకర్షణీయంగా మారింది. మరో రెండు రోజుల పాటు దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. రేపు (ఆదివారం) తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనను ప్రతిబింబించేలా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement