Tuesday, November 26, 2024

TG | వాటర్ లాగింగ్ ఏరియాల్లో ప్రత్యేక చర్యలు..

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయాన్ని పరిశీలించారు.

వర్షాలు కురిస్తే ఆయా ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపుల‌ను నిర్మిస్తామని దానకిషోర్ తెలిపారు. నగరంలో వాటర్ లాగింగ్ ఉన్న 140 ప్రాంతాల్లో సంపుల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఖైరతాబాద్ మండలం, జూబ్లీహిల్ సర్కిల్ పరిధిలోని 11 ప్రాంతాల్లో రూ.20 కోట్లతో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులను నిర్మించనున్నట్లు తెలిపారు. వానలు కురుస్తున్న సమయంలో సంపుల్లోకి నీటిని సేకరించి సమీపంలోని కాల్వల్లోకి పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దానకిషోర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement