ఆరు గ్యారేంటీల హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని.. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మోసాలను బీజేపీ ఉపేక్షించబోదని… 25 వేల పోస్టులకే నోటిఫికేషన్లకు ఇచ్చి.. 55 వేల పోస్టులు ఎలా భర్తీ చేశారని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ మూర్ఖత్వంతో నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకే వర్గానికి కొమ్ముకాస్తుందని.. అన్ని పథకాలు ఒకటే వర్గానికి అందిస్తోందని మండిపడ్డారు. భాగ్యనగర్‌ను బంగ్లాదేశ్‌గా మార్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం అందించాలని, మేయర్ పదవి బీజేపీకి దక్కితే హైదరాబాద్ నగరం అభివృద్ది మరింత పెరుగుతుందన్నారు.