హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగి నరేందర్ రెడ్డి వివాదాస్పద పోస్ట్ పై టీజీఎస్ ఆర్టీసీ సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగి జొన్నాడ నరేందర్ రెడ్డిని ఆర్టీసీ యాజమాన్య సస్పెండ్ చేసింది. ఇటీవల .మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన చిన్నారి పోస్టుకు సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర కామెంట్ చేశాడు .నరేందర్ రెడ్డి . దీంతో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఇటువంటి చర్యలను సంస్థ ఎట్టిపరిస్థితులలోనూ ఆమోదించదని సంస్థ పేర్కొంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement