Friday, November 8, 2024

TG – యాదాద్రీశ్వరుడి స‌న్నిధిలో రేవంత్… పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రత్యేక పూజలు

కుటుంబ స‌మేతంగా స్వామి వారి ద‌ర్శ‌నం
ఆల‌యాభివృద్ధిపై అధికారుల‌తో చ‌ర్య‌లు
భ‌క్తుల‌కు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌
సీఎం రేవంత్‌కు స్వాగ‌తం ప‌లికిన మంత్రులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, యాదాద్రి : యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా శుక్రవారం యాదాద్రి ఆల‌యానికి వ‌చ్చారు. అనంత‌రం ఆయ‌న స్వామి వార్ని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు.. అంత‌కు ముందు మంత్రులతో కలిసి ఆలయంలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి ఆలయ ప్రధానార్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చిత్రం ముద్రించిన శాలువాతో సీఎంను సత్కరించారు.

- Advertisement -

ఆల‌యాభివృద్ధిపై అధికారుల‌తో చ‌ర్చ‌లు
ఆలయంలో మౌలిక‌ వసతులు, అభివృద్ధిపై అధికారులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. భక్తులకు ఎలంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఇక్క‌డ‌కు వ‌చ్చిన భ‌క్తుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరారు.

యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్ష.

యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల‌తో అల‌య అభివృద్ధిపై రేవంత్ సమీక్ష నిర్వ‌హించారు.. ఈ స‌మీక్ష‌లో న మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఎమ్మెల్యేలు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు..

మంత్రులు స్వాగ‌తం
న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి, యాదగిరిగుట్ట హెలిప్యాడ్ వ‌ద్ద మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి సీఎం చేరుకున్నారు. అనంతరం విష్ణు పుష్కరిణి చేరుకుని అంజలి ఘటించారు. అక్కడ నుంచి సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా అఖండ దీపారాధనను దర్శించుకుని దీపం వెలిగించి పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement