Wednesday, December 25, 2024

TG | మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌

ఖమ్మం పట్టణానికి ప్రమాదకరంగా మారిన మున్నేరు నదికి ఇరువైపుల యుద్దప్రాతిపదికన రి-టైనింగ్‌ వాల్‌ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. మున్నేరు ఉగ్రరూపం దాల్చినా ఖమ్మానికి ఎలాంటి నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు.

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనుల పురోగతిపై అధికారులతో చర్చించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ నిర్మాణం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో రానుంది. కాగా.. ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లల్లోని దాదాపు 23 కిలోమీటర్ల మేర కాంక్రీట్‌ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. కాగా.. గోడ నిర్మాణ పనుల వేగం మరింత పెరగాలని సూచించిన మంత్రి పొంగులేటి.. నెలలో రెండు సార్లు స్వయంగా తానే పనుల్ని పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఈ గోడ నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను త్వరగా చేపట్టాలని సూచించిన మంత్రి పొంగులేటి.. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement