Saturday, November 23, 2024

TG Rains | మ‌రో మూడు రోజులు వాన‌లే !

రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నేప‌థ్యంలో రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నెల 8వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ రెండు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు, గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement