Thursday, July 4, 2024

TG | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం…

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట, పంజాగుట్ట, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరో రెండు మూడు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement