హైదారాబాద్ – సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో జెండాలు ఎగరవేయనున్నారు మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు.
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జెండా ఎగరవేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై నెలకొన్న వివాదానికి తెరపడింది.గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. అటు.. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది..
- Advertisement -