తెలంగాణ వైద్యారోగ్య శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు మరో 371 పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పోస్టుల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులున్నాయి. ఈ నెల 14 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా బోర్డు నిర్ణయించింది. నవంబర్ 17న ఆన్లైన్లో పరీక్ష జరగనుంది.