Friday, September 6, 2024

TG | నాగర్ కర్నూలు ఘటన సిగ్గుపడే చర్య : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇల్లందకుంట, (ప్రభ న్యూస్) : నాగర్ కర్నూల్ జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై జరిగిన దారుణం సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అడ్డగోలు దందాలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న క్రిమినల్స్ పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పు చేయాలనుకునే క్రిమినల్స్ గజగజ వణికేలా ఉక్కుపాదం మెపాలన్నారు.

- Advertisement -

6 హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయండి..

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనవసర అంశాలను పక్కనబెట్టి ఎన్నికల హామీల అమలుపై చర్చించాలని సూచించారు. 6 హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల పేరు చెప్పుకుని తెలంగాణ ప్రజలను పూర్తిగా వంచించిన విషయాన్ని కళ్లారా చూశాం.

ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది. 6 హామీల పేరుతో మోసం చేస్తుంది. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోందని, పనికిరాని సమస్యలపై చర్చ పక్కనపెట్టి, ఇచ్చిన హామీలు ఎప్పటికి అమలు చేస్తారో అందుకు అయ్యే ఖర్చుపై చర్చించాలన్నారు.

ఇల్లందకుంట ఆలయాన్ని అభివ్రుద్ధి చేస్తా..

మంత్రివర్గ సమావేశం అనంతరం 6 హామీల అమలు తేదీని యుద్ధప్రాతిపదికన ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇంకా మాయమాటలు చెప్పి దాటవేయడానికి ప్రయత్నిస్తే తిరగబడే ప్రమాదం ఉందన్నారు. ఇల్లందకుంట రాములోరి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని, కేసీఆర్ లాగా దొంగ మాటలు చెప్పను అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement