Thursday, November 21, 2024

TG | మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం..

రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం ఈరోజు (జూన్ 21) తెలంగాణ సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించింది.

పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు సీఎస్ శాంతికుమారి ఈ మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఆకాంక్షించారు.

ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా మహిళా శక్తి క్యాంటిన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలని పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement