Monday, September 16, 2024

TG – నేతన్నలకు గుడ్ న్యూస్ …. త్వరలో రుణాలు మాఫీ: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఐఐహెచ్ టీ వర్చువల్‌గా ప్రారంభం
చేనేత అభయహస్తం లోగో ఆవిష్క‌ర‌ణ‌
ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ. 2,500 ప్రోత్సాహకం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : నేతన్నల రూ. 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. సోమ‌వారం నాంపల్లి లలిత కళాతోరణంలో ఐఐహెచ్ టీ(ఇండియన్ ఇన్ స్టిట్యట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వేలాది మంది నేతన్నలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చింద‌ని, కానీ బకాయిలు చెల్లించలేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతన్నలను ఆదుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్‌టీకి పేరు
అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్‌టీకి పేరు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీని కలిసి ఐఐహెచ్‌టీ అవసరంపై వివరించామని, రాజకీయాలకతీతంగా కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ఐఐహెచ్ టీ విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అంద‌జేస్తామ‌ని చెప్పారు. విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏటా 60 మందికి టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల‌కు ఇస్తామ‌న్నారు.

- Advertisement -

చేనేత అభ‌య‌హ‌స్తం ప్రారంభం
ఈ సందర్భంగా ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘నేతన్నకు చేయూత’ పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులు విడుదల చేశామ‌న్నారు. మ‌హిళా సంఘాల స‌భ్యుల‌కు చీరుల పంపిణీ
ఏడాదిలో మహిళా సంఘాల సభ్యులకు రెండు క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేనేత అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్‌ శాంతికుమారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement