Friday, October 18, 2024

TG | మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేసింది.

ప్రధానంగా ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ప‌గ‌లు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, సాయంత్రంవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement