Tuesday, October 22, 2024

TG | లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం…

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల డిగ్రీ & పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ లాసెట్-2024, ‘పీజీఎల్‌సెట్-2024’ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. టీజీ లాసెట్-2024 అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న ప్రకటించనున్నారు. ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి ఆగస్టు 27న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

పీజీఎల్‌సెట్ ఇలా..

‘పీజీఎల్‌సెట్-2024 అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 30 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 31న ప్రకటించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 12 మధ్య నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement