లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. పరిగి కొత్త డిఎస్పీగా ఎన్.శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి మరి కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంని కాంగ్రెస్ నేతలు అరోపిస్తుండగా, మరోవైపు కొడంగల్‌లో గిరిజనులు, లంబాడాలకు మేలు జరగకూడదని బీఆర్ఎస్ నేతలు కుట్రపన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం విదితమే.