Wednesday, November 27, 2024

TG – అదానీతో ఒప్పందాలు దేశానికి అవ‌మానం -కెటిఆర్

కాంగ్రెస్,బిజెపి లు అదానీల‌తో అంట‌కాగ‌డంపై కెటిఆర్ గ‌రం గ‌రం
రామ‌న్న‌పేట సిమెంట్ ఫ్యాక్ట‌రీ అనుమ‌తిపై ఆగ్ర‌హం
ఇందులో భడే బాయ్ వాటా ఎంత‌, మీ కాంగ్రెస్ హైక‌మాండ్ వాటా ఎంత‌
ద‌గాకోరు మోస‌గాడికి అంబుజా సిమెంట్ ఎలా ఇచ్చారంటూ ప్ర‌శ్న

హైద‌రాబాద్ – అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు అదాని అంటూ బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటుగా విమర్శించారు. అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీపై యూఎస్‌ అభియోగాలు న‌మోదైన నేప‌థ్యంలో త‌న ఎక్స్ ఖాతాలో కెటిఆర్ నేడు ట్విట్ చేశారు. అదానీతో కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు.

తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు.

ఈ లాంగ్ మార్చ్ లేంటీ… ప్ర‌జాపాల‌న అంటే ఇదేనా

- Advertisement -


ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? అంటూ రేవంత్ ను ప్ర‌శ్నించారు కెటిఆర్.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. మానుకొండ‌లో గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అంటూ నిల‌దీశారు. అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ? అంటూ ప్ర‌శ్న‌లు కురిపించారు. ఇలా లాంగ్ మార్చ్ నిర్వ‌హించ‌డం ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన..
మొత్తంగా రాక్షస పాలన అంటూ వేలెత్తి చూపారు కెటిఆర్ . ఖబర్దార్ రేవంత్. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది అంటూ హెచ్చ‌రించారు.

క‌న్న‌త‌ల్లికి తిండిపెట్ట‌ని వాడు…

కన్న తల్లికి తిండి పెట్టని వ్యక్తి పిన్నికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఓవైపు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని ట్వీట్ చేశారు. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, రోజుకో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు మరణిస్తున్నా సరైన చర్యలు తీసుకోకుండా పిట్టలదొర మాటలు చెబుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆసుపత్రులలో, రైతులు జైళ్లలో, నిరుద్యోగులు రోడ్లపై ఆందోళనలలో ఉన్నారని చెబుతూ ‘జాగో తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement