Saturday, June 29, 2024

TG | హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రైలు రోకో సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని ఆ పిటిషన్‌లో కేసీఆర్ కోరారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు వెల్లడించారు. రైలు రోకో కార‌ణంగా రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.

అయితే, తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వ‌లేద‌ని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకే కేసులు నమోదు చేశారని, రైల్ రోకో ఘటన జరిగిన మూడేళ్లకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. కేసుకు బలం లేదని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement