Sunday, October 6, 2024

TG | జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల..

తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు.

తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇక.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement