Wednesday, January 8, 2025

TG | ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు !

తెలంగాణ ఇంటర్ బోర్డు… ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆలస్య రుసుముతో ఇంట‌ర్ ఫీజ్ చెల్లింపునకు డిసెంబర్ 25 చివరి తేదీ ఆఖ‌రు కాగా… ఆ తేదీని ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.2500 ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు ఫీజ్ చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

కాగా, ఈ ఫీజు చెల్లింపు పొడిగింపు 1వ, 2వ సంవత్సరం విద్యార్థులతో సహా రెగ్యులర్, వొకేష‌న‌ల్ విద్యార్థులకు వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి మార్చి 25 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement