Thursday, September 5, 2024

TG | హోటల్స్ టైమ్ అప్పటిదాకా.. సీఎం ఏం చెప్పిండంటే

హైదరాబాద్ లో రాత్రి పూట హోటళ్లు తెరిచే సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం దుకాణాలు మినహా అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపారు. నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లకు ఈ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement