Monday, September 30, 2024

TG | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హైదర్ నగర్, కూకట్ పల్లి, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, మల్కాజిగిరి, నేరేడ్ మెట్, కుషాయిగూడ, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండడంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement