Thursday, December 26, 2024

TG – హరీశ్, కవితల హౌస్ అరెస్ట్ – భారీగా పోలీసు మోహరింపు

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై ధర్నాకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్‌ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. సీనియర్ నేత హరీష్ రావు, ఎం ఎల్ సీ కవిత ల ఇంటివద్ద పోలీస్ లు భారీగా మోహరించారు. ఈ ఇద్దరి నేతలను వారి వారి గృహాలలో పోలీస్ లు నిర్బంధించారు.

అలాగే . కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వివేకానంద ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement