గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాల చెల్లింపునకు రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసింది. మల్టీపర్పస్ వర్కర్ల జీతాల కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 మంది కార్మికులకు మే వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. కాగా ఈరోజు పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement