తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక బ్యాకలాగ్ ఉన్న విద్యార్థులు రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చు.
రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు మొత్తం రూ.125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు బ్యాక్‌లాగ్‌లు ఉంటే రూ.110, మూడు పేపర్ల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. పూర్తి వివరాల కోసం https://www.bse.telangana.gov.in ని సందర్శించండి.