తెలంగాణలో ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక సీబీటీ ఆధారిత పరీక్షను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలు సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
ఇదీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్
- మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జూలై 18న
- జూలై 18న రెండవ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
- జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జూలై 20న SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
- జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
- జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయోలాజికల్ సైన్స్ పరీక్ష
- జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష