Friday, October 4, 2024

TG | షెడ్యూల్ ప్రకార‌మే డీఎస్సీ పరీక్ష…

తెలంగాణలో డీఎస్సీ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మరిన్ని పోస్టులను చేర్చి మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11వ తేదీ నుంచి డీఎస్సీ హాల్ టిక్కెట్లను అందుబాబులో వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతాయి.

2.79 లక్షల దరఖాస్తులు..

రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు జూన్ 20తో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

- Advertisement -

రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు..

జూలై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.
జూలై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్‌జీటీ పరీక్షలు జరగనున్నాయి.
జూలై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్,
జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్,
జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్,
జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష ,
జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement