Sunday, December 22, 2024

TG – సినీ సెలబ్రిటీస్ బాధ్యత గా వ్యవహరించండి : డీజీపీ

కరీంనగర్ – వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్‌ అన్నారు. పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యాతాయుతంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కంటే..సినిమా ప్రమోషన్‌ ముఖ్యమైన అంశం కాదన్నారు.

నేడు కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు అల్లు అర్జున్ (సంధ్య థియేటర్‌ తొక్కిసలాట), మంచు మోహన్ బాబు (మీడియా ప్రతినిదిపై దాడి) ఘటనలపై ఆయన స్పందించారు.

మీడియా ప్రతినిదిపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం సినీ నటుడు మోహన్‌ బాబుపై చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్‌ చెప్పారు. ‘వ్యక్తిగతంగా మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం. ఆయన సినీ హీరో (అల్లు అర్జున్) కావొచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు. ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు మంచిది కాదు. సినిమాల్లో హీరోలు అయినా బయట మాత్రం పౌరులే. పోలీసు శాఖ చట్టానికి లోబడి పనిచేస్తుంది. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తాం’ అని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

‘సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశాం. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయి. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. హీరోలు స్థానిక పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించాలి. ప్రజలకు రక్షణ కల్పించడం మా మొదటి ప్రాధాన్యం. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రజల భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement