Friday, October 18, 2024

TG – కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా – 18న కెటిఆర్ స్టేట్మెంట్ రికార్డ్

కెటిఆర్ పిటిష‌న్ పై నేడు విచార‌ణ‌
18న కెటిఆర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షుల విచార‌ణ‌కు నాంప‌ల్లి కోర్టు ఓకే

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. పిటిషనర్ తో పాటు సాక్షులుగా ఉన్న బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు
శ్రవణ్ వాంగ్మూలాను నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణ 18కి వాయిదా వేసింది.

- Advertisement -

కాగా, కెటిఆర్ ప్ర‌మేయంతో నే నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోయారంటూ మంత్రి సురేఖ మీడియా స‌మావేశంలో ఆరోపించారు. దీనిపై కెటిఆర్ ఆమెను క్ష‌మాప‌ణ కోరుతూ లీగ‌ల్ నోటీస్ జారీ చేశారు. అయితే ఈ నోటిస్ పై సురేఖ నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఆమెపై నేరుగా ప‌రువు న‌ష్టం దావా పిటిష‌న్ ను కెటిఆర్ దాఖ‌లు చేశారు.. దీనిపైనే నేడు విచార‌ణ జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement