- మహబూబ్‌నగర్ స్థానంలో బీజేపీ ఘన విజయం
- హోరాహోరీ పోరులో నాలుగువేల ఓట్ల మెజార్జీతో డికే అరుణ గెలుపు
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ
- కాంగ్రెస్ కు తప్పని ఓటమి
సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.
కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు లీడ్ వచ్చింది. కాని మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో బీజేపీ మెజార్టీ ఓట్లు సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ పై చేయి కనబరిచింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పదిసార్లు పర్యటించిన కాంగ్రెస్ కి విజయం దక్కలేదు. . అభివృద్ధి, సంక్షేమ మంత్రం పని చేయలేదు.
కాగా.. జూన్ 2న విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.