సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు మొదటి విడతలో రూ.5 లక్షలు చెల్లించాడు. రెండో విడతలో భాగంగా గురువారం రూ.3 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సీసీఎస్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.