Saturday, November 23, 2024

TG | గన్‌పార్క్ వద్ద గందరగోళం..

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడాన్ని నిరసిస్తూ… అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు. అయినా కూడా వారు వినిపించుకోకపోవడంతో పోలీసులు పెద్దఎత్తున చేరుకుని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను అరెస్ట్‌ చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో యువతను మభ్య పెడుతుంది : కేటిఆర్

జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసిందన్నారు.

నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అనడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని అడిగితే అసెంబ్లీలో కనీసం రెండు నిమిషాల సమయం ఇవ్వలేదన్నారు. యువతను మభ్యపెట్టి ఎక్కువరోజులు ప్రభుత్వాన్ని నడపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అని.. తాము యువత తరఫున పోరాడుతుంటే తిడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్ ఇచ్చి తిట్టించారని మండిపడ్డారు.

https://twitter.com/BRSparty/status/1819381377088823693?t=wYNnqhRPS2kk95BzOFyCLQ&s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement