Thursday, November 21, 2024

TG – క‌క్ష రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం – కెటిఆర్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి కౌంటర్

ప్ర‌భుత్వం కూల్చ‌డంపై బీఆర్ఎస్ దృష్టి
మా వైఫ‌ల్యాలేంటో కేటీఆర్ చెప్పాలి
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తాము కక్ష రాజకీయాలకు వ్యతిరేకమని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం గాంధీభవన్‌లో నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా పాత్ర పోషించిందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయ‌న్నారు. ప్ర‌భుత్వం కూల్చ‌డంపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింద‌ని అన్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యం ఏమిటో కేటీఆరే చెప్పాలి

ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? అని నిలదీశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం కూడా ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని అన్నారు. మీరు అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని విమర్శించారు.

కుల గ‌ణ‌న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం

- Advertisement -

కుల గణన విప్లవాత్మక నిర్ణయమని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. స్కీములు పెరగాడానికి కులగణన చేస్తున్నామని స్పష్టం చేశారు. కుల గణన చేశామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement