ఇటీవలే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్
నేటి కెటిఆర్ తో అసెంబ్లీలో భేటి
హస్తం పార్టీలో కనీస మర్యాద, గౌరవం లేదంటూ వెల్లడి
బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానన్న బండ్ల కృష్ణమోహన్
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఇప్పటి వరకు బిఆర్ఎస్ నుంచి ఒకరు హస్తం తీర్ధం పుచ్చుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు.. గద్వాల్ నుంచి బిఆర్ఎస్ నుంచి గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.. అయితే ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.. బిఆర్ఎస్ పార్టీలోనే తన ప్రస్థానం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.. ఈ మేరకు నేటి ఉదయం అసెంబ్లీ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బండ్ల కలిసి, ఇకపై తాను బీఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతానని తన మనసులోని మాటను చెప్పారు..
కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నానని కాంగ్రెస్ పార్టీలో కనీసం మర్యాద లేదని, గుర్తింపు లేదని, అవమానానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కెటిఆర్ తిరిగి తమ పార్టీలోకి వస్తే సాదరపూర్వకంగా స్వాగతం పలుకుతామని బండ్లకు భరోసా ఇచ్చారు.. అలాగే ఇది ప్రారంభమని, తమ పార్టీ వీడిన మరికొందరు కూడా తిరిగి తమ మాతృపార్టీలోకి వస్తారని కెటిఆర్ చెప్పారు.