Sunday, January 19, 2025

TG చెట్టు కింద అప్పుడే పుట్టిన ఆడబిడ్డ

మాక్లూర్ ( ఆంధ్రప్రభ) : , అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను వదిలేసిన సంఘటన మండల పరిధిలోని చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం తెల్లవారు జమున గ్రామ శివారులోని చెట్టు క్రిందా పసి పాపను అటు వైపు వెళ్లిన స్థానికులు గమనించి చూడగా బొడ్డు కూడా కత్తిరించాకుండా రక్తపు మరకలతో ఉన్న అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అ పసి కందును స్థానిక అంగన్వాడీ టీచర్ శమంతా ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ పసి కందు ను ఎవరు వదిలారు.? రాత్రి లేక తెల్లవారు జామున వదిలారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు మక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement