రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది హాజరుకు అధునాతన ఫేస్ రికగ్నిషన్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులు సచివాలయానికి రాకపోకల సమయంలో తప్పనిసరిగా హాజరు వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, సర్య్కులేటింగ్ అధికారులకు అందరికీ ఈ విధానం వర్తించనుందని.. ఈ నెల 22నుంచి ఈ విధానం అమలులోకి రానుందని ప్రభుత్వం పేర్కొన్నారు. ఈ మెషీన్లను అన్ని ఫ్లోర్‌లలో బైటా, లోపల, లిఫ్టుల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.