Thursday, November 14, 2024

TG | చ‌ట్ట సభలకు వయోపరిమితి తగ్గించాలి..

దేశంలో చట్ట సభలకు పోటీ చేయడానికి వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించడం వల్ల యువత చట్ట సభల్లోకి రావడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు.

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం పురస్కరించుకుని #SCERT ప్రాంగణంలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు మాక్ అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించారు. ఈ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క, మంత్రి
పొన్నం ప్రభాకర్ తో కూర్చొని వీక్షించించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎంతో క్రమశిక్షణతో చిల్డ్రెన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ అభినందించారు.

ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేస్తూ చట్ట సభలకు పోటీ చేయడానికి విధించిన వయో పరిమితిని కూడా 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ తీర్మానం చేయాలి అని అన్నారు. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ఎంపీలకు పంపించాలని.. తద్వారా పార్లమెంట్ సమావేశాల్లో వారు ఈ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement