Monday, November 18, 2024

TG | త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దీర్ఘకాలిక రుణాలతో నీటిపారుదల రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ చేసిన స్వల్పకాలిక రుణాలతో రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతుందనే అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో ధీర్ఘకాలిక రుణాల సమీకరణ వైపు నీటిపారుదల శాఖ దృష్టి సారించింది.

స్వల్పకాలిక రుణాలతో ధీర్ఘకాలిక రుణాలతో పోల్చి చూసినప్పుడు తిరిగి చెల్లించే ఈ.ఎం.ఐ తో పాటు వడ్డీ మొత్తలలో వెసులుబాటు లభిస్తుండడంతొ ఈనిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

మంగళవారం జలసౌదలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఏషియన్‌ ఇన్ఫాస్ట్ర్రాక్ష్రర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ….

నీటిపారుదల శాఖకు ప్రస్తుతం ఉన్న స్వల్ప కాలిక రుణాలను సైతం దీర్ఘకాలిక రుణాలుగా మార్చడంతో ప్రభుత్వ ఖజానా మీద పడుతున్న భారం తగ్గడంతో పాటు వడ్డీ చెల్లింపులలో వెసులుబాటు ఉంటుందన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకున్న పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కొత్త ఆయకట్టు సృష్టించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

ఆ క్రమంలోనే ధీర్ఘకాలిక రుణాలునిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ లకు వర్తింపజేయాలని బ్యాంక్‌ ప్రతినిధులకు సూచించినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలతో పాటు గిరిజనులు అత్యధికంగా ఉన్న ములుగు జిల్లాతో పాటు ఫ్లోరోసిస్ బారిన పడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఈ రుణాలు వినియోగించేలా చూడాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

యస్‌.ఎల్‌.బి.సి, పాలమూరు-రంగారెడ్డి, డిండి లతో పాటు నల్లగొండ, ఖమ్మం, మహాబుబ్‌ నగర్‌ జిల్లా లతో పాటు ఉత్తర తెలంగాణా జిల్లాలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు లకు దీర్ఘకాలిక రుణాలు ఉపయోగించడంతో త్వరితగతిన తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ఏషియన్‌ ఇన్ఫాస్ట్ర్రాక్ష్రర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులను రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావుతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. అలాగే అన్ని ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహదారుడు ఆదిత్యనాత్‌ దాస్‌, కార్యదర్శి రాహుల్‌ బొజ్జ ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీలు అనిల్‌ కుమార్‌, నాగేందర్‌ రావు, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్‌ లతో పాటు ఏషియన్‌ ఇన్ఫాస్ట్ర్రాక్ష్రర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు సంగ్మా కిమ్‌, రాజేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement