వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గాను 3,36,013 ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు.
మార్చి 2021లో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేష్ రెడ్డి (భరస), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) బరిలో ఉన్న సంగతి తెలిసిందే.