Monday, November 11, 2024

TG – 35 వేల పోస్టుల‌కు త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌ – రేవంత్

ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్‌కీ బేసిక్ నాలెడ్జి ఉంట‌లేదు
గంజాయి, డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌గా మారుతున్న‌ విద్యార్థులు
ఉపాధి అవ‌కాశాల‌తోనే స‌న్మార్గంలోకి యువ‌త
స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌ని క‌ళాశాల‌పై చ‌ర్య‌లు
స్కిల్ ట్రైనింగ్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
త్వరలోనే మరో 35 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం హైదరాబాద్‎ బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్‎ కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ స‌మ‌స్య‌ను గుర్తించామ‌ని, అన్ని శాఖ‌ల్లో ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టామ‌ని తెలిపారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వెబ్ సైట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని, కానీ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుని ఆచరణలో పెడుతున్నామని పేర్కొన్నారు.

గ‌త ప్ర‌భుత్వ తీరు వ‌ల్ల‌…

గత ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో పదేళ్ల తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు భర్తీ చేసినంత మాత్ర‌నా నిరుద్యోగ సమస్య తీరదన్నారు. అందుకే ప్రైవేట్ సెక్టార్ల కూడా యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టిపెట్టామని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

- Advertisement -

గంజాయి, డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌గా విద్యార్థులు

గంజాయి, డ్ర‌గ్స్ తీసుకోవ‌డ‌మే కాకుండా వాటిని అమ్ముతూ పెడ్ల‌ర్‌గా మారుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గంజాయి, డ్ర‌గ్స్ తెలంగాణ‌కు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌న్నారు. మాద‌క ద్ర‌వ్యాల‌పై పోరాటంలో యువ‌త ముందండాల‌ని పిలుపునిచ్చారు. అసాంఘిక చ‌ర్య‌ల‌కు యువ‌త పాల్ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఇందులో భాగంగా ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌రుస్తున్నామ‌న్నారు.

నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించ‌ని కళాశాల‌ల‌పై చ‌ర్య‌లు

ప్ర‌స్తుతు ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు బేసిక్ నాలెడ్జి ఉండ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో ఉపాధి అవ‌కాశాలు కోల్పోతున్నార‌న్నారు. స‌రైన ప్ర‌మాణాల‌తో విద్యా అందించాల‌ని ఇంజ‌నీరింగ్ క‌ళాశాల యాజ‌మానుల‌కు సూచించారు. స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌క‌పోతే క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement