Saturday, September 21, 2024

TG | కల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్లు : సీఎం రేవంత్

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.50 లక్షలు అడిగినట్లు పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ.5 కోట్లు ఇచ్చి ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తా అని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల రుణమాఫీ

తాను ఆగస్ట్ 2 నుండి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఆగస్ట్ నెలలోనే హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement