తెలంగాణలో ఇవ్వాల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తున్నారు. టెట్ రాసేందుకు 3,80,589 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30, మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.
అయితే.. అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వమని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. టెట్ అభ్యర్థుల కోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. ఇక.. కరీంనగర్ జిల్లా కేంద్రం మొత్తం టెట్ పరీక్ష రాసే అభ్యర్థులతో నిండి పోయింది. కరీంనగర్ లో పేపర్ 1 పరీక్ష రాసేందుకు 16 వేల మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తరలి వచ్చారు. పరీక్ష ఉదయం 9-30 గంటలకు ప్రారంభం కానుండడంతో అరగంట ముందే అభ్యర్థులు సెంటర్ల వద్ద బారులు తీరారు.