Saturday, November 23, 2024

టెట్‌ దరఖాస్తు గడువు పొడిగించాలి.. జిల్లాలో పరీక్షా కేంద్రాలు పెంచాలి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌ అప్లికేషన్‌ గడువు పెంచి ఎడిట్‌ ఆప్షన్‌కు అవకాశం కల్పించాలని టెట్‌ అభ్యర్థులు కోరారు. టెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 12 వరకు ఉన్న గడువుని మరో వారం రోజులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం నాయకులు రామ్మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఫోటో స్కానింగ్‌, సంతకం చేయడంలో తెలియకుండానే తప్పులు దొర్లుతున్నాయని, దాంతో ప్రతి రోజూ టెట్‌ హెల్ప్‌ లైన్‌కు వందలాది మంది అభ్యర్థులు ఫోన్‌ చేస్తున్నారని తెలిపారు.

అధికారులు మాత్రం సరైనా సమాదానం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో రాసిన టెట్‌ ఫలితాల్లోనూ కొందరికి వివరాలు తప్పులుగా చూపిస్తున్నాయని, వాటిని సరిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలో టెట్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ, జిల్లాలో పరీక్షా కేంద్రాలను పెంచాలని సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement