Thursday, November 21, 2024

Spl Story | జూన్​ 7 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య​ టెస్ట్ మ్యాచ్​​.. ప్రపంచ చాంపియన్​ ఎవరో?

‘ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ 2023’ అనేది అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్. ఇది 2009లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌. జూన్ 7న ప్రారంభమయ్యే ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ సిరీస్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక.. ఆస్ట్రేలియా , భారత్​ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్​ మైదానంలో జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు  జరగనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న దేశాల్లో టెస్టు మ్యాచ్‌ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ని భావించిన ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ).. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప‌లు టీమ్‌లను ఎంపిక చేయనుంది. దీనికి ఈ రెండేళ్ల కాలంలో ఆడిన టెస్టు మ్యాచ్‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పాయింట్లను ఇవ్వనున్నారు. ఇక.. ఆ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆస్ట్రేలియా, భార‌త్‌ వ‌రుస‌గా 1, 2 స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆ రెండు జ‌ట్లు త్వర‌లో తొలి వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ మ్యాచ్‌ను ఆడ‌నున్నాయి. అందులో గెలిచిన జ‌ట్టుకు వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌గా ట్రోఫీని అంద‌జేస్తారు.

టెస్టు చాంపియ‌న్ షిప్‌లో 152 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. భార‌త్ ఇప్పటి వ‌రకు ఆడిన మ్యాచ్‌ల ప్రకారం 127 పాయింట్లతో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో టాప్ 2లో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్​ జట్ల మ‌ధ్య టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

అయితే టెస్టులు అంటేనే స‌హ‌జంగానే డ్రా అయ్యే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇక ఆడబోయేది టెస్టు చాంపియ‌న్‌షిప్ మ్యాచ్‌. అది కూడా ఒక్కటే మ్యాచ్‌. మ‌రి అందులో రెండు జట్లూ స‌మాన ప్రద‌ర్శన క‌న‌బ‌రిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే ప‌రిస్థితి ఏమిటి? విజేత‌గా ఎవ‌రిని ప్రక‌టిస్తారు ? అంటే.. ఇప్పటి వ‌ర‌కు ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు సంబంధించి టై -బ్రేక‌ర్ ఫార్ములాను ప్రక‌టించ‌లేదు.

- Advertisement -

అంటే మ్యాచ్ డ్రా అయితే విజేత‌గా ప్రక‌టించ‌డానికి జ‌ట్లకు ఇంకా ఏమైనా ప‌రీక్ష పెడ‌తారా? అన్న వివ‌రాల‌ను ఐసీసీ వెల్లడించ‌లేదు. టీ20లు, వ‌న్డేల్లో అయితే సూప‌ర్ ఓవ‌ర్ ఉంటుంది. కానీ, టెస్టుల్లో అలాంటిది ఏమీ లేదు. అందువ‌ల్ల మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరు జ‌ట్లను సంయుక్త విజేత‌గా ప్రక‌టిస్తారు. మ‌రి టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర‌కు ఈ విష‌య‌మై ఐసీసీ ఏమైనా ప్రక‌ట‌న చేస్తుందా, లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement