వలస కూలీపై దాడికి పాల్పడి అతడి ప్రాణాన్ని తీశారు ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్‌లోని బందిపూర్‌లో బీహార్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. బీహార్‌లోని మాధేపురాకు చెందిన మహ్మద్ అమ్రెజ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు.కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు. టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మహ్మద్ అమ్రేజ్, బీహార్‌లోని సోద్నారా సుంబల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బండిపొరా వద్ద అతన్ని తీవ్రంగా గాయపర్చారు ఉగ్రవాదులు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement